NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద జన జాతర

1 min read

కిలోమీటర్ వరకు ప్రజలు వాహనాల తో పుంగనూరు రోడ్డు రద్దీ

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు

మదనపల్లె , ( బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి ) : మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని మదనపల్లె, నిమ్మన పల్లి, రామస ముద్రం, తంబళ్ల పల్లి, పెద్ద మండ్యం, మొలకల చెరువు, పిటిఎం, బి.కొత్త కోట, కురబలకోట, పుంగనూరు, చౌడేపల్లి మండలా లకు సంబంధించి మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డు లోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో ఎంపిటిసి, జడ్పిటిసి ఓట్లు లెక్కింపు జరిగింది. ఈ సందర్బంగా ఫలితాలు తెలుసు కోవడానికి పెద్ద ఎత్తున కళాశాల వద్దకు చేరుకు న్నారు. దింతో కళాశాల ఎదుట జన జాతర తలపించింది. ఓట్ల లెక్కింపు కేంద్రం నుండి సుమారు కిలోమీటరు పొడవున వాహనాలు,  జనాలు తో పుంగనూరు రోడ్డు దర్శనమిచ్చింది. ఎక్కడ ఎలాంటి అవాంచనియ ఘటనలు జరగ కుండా పోలీసులు కట్టుదిట్ట మైన భద్రత ను ఏర్పాటు చేశారు. విజయం సాధించిన వ్యక్తులు రోడ్డు మీదకు రాగానే జిందాబాద్ లు కేరింతలతో వారికి అభినంద నలు తెలిపారు. కాగా తుది ఫలితాలు రావ టానికి ఆలస్యం కావడంతో బయట వేచి ఉన్న ప్రజల్లో తీవ్రమైన ఉత్కంఠ ఆసక్తి పెరిగింది. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *