NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి వ్యవసాయరైతులకు నవధాన్య విత్తనాలపై అవగాహన

1 min read

జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి.వెంకటేష్  ఆదేశాలు మేరకు డివిజనల్ ఇన్చార్జి ఎన్ఎఫ్ఏ నవీన ఆధ్వర్యంలో విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో బుధవారం  ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి.వెంకటేష్  ఆదేశాలు మేరకు డివిజనల్ ఇన్చార్జి ఎన్ఎఫ్ఏ నవీన ఆధ్వర్యంలో విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నవధాన్యాకు విత్తనాలు ప్రాముఖ్యత, సీడ్ పెలెటైజేషన్ విధానం మరియు వాటి ప్రయోజనాలుపై అవగాహన కల్పించారు. గ్రామంలో విత్తన గుళికలను తయారు చేసి ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా రైతులకు చూపిస్తూ, ప్రస్తుత ఎల్నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి రైతు ఈ విధానాన్ని తమ పొలాల్లో అమలు చేయాలని సూచించారు. విత్తనాలను గుళికల రూపంలో తయారు చేసి పొలాల్లో చల్లడం ద్వారా అవి సుమారు ఆరు నెలలు వరకు సురక్షితంగా నిల్వ ఉండటమే కాకుండా, అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మెరుగైన మొలక శాతాన్ని అందిస్తాయని వివరించారు. అలాగే 30 రకాల వరకు నవధాన్యాలను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేయడం ద్వారా భూసారం పెరిగి భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందని, రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించి మెరుగైన సాగు ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు మరియు మహిళా రైతులు, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

About Author