NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి

1 min read

కడప రీజియన్ ఏడీ ఉశేనమ్మ..

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్ విబిడిసిపి(జాతీయ కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ అధికారి)అసిస్టెంట్ డైరెక్టర్ కడప రీజియన్ ఉశేనమ్మ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో గురువారం ఉదయం మలేరియా వ్యాధి రాకుండా ఇండ్లకు దోమల నివారణ కోసం పిచికారి చేసి న ఇండ్లను ఏడి పరిశీలించారు.మలేరియా ఏ విధంగా వస్తుంది వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏడి ప్రజలకు అవగాహన కల్పించారు. దోమ కాటు వల్ల మలేరియా వస్తుందని ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని ప్రజలతో అన్నారు.తర్వాత మిడుతూరు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్,కడుమూరు డాక్టర్ పి.రాజు,సీహెచ్ఓ సురేష్ బాబు,సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ,సూపర్ వైజర్ ఏసేపు,రామతులశమ్మ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author