మృతుని కుటుంబాన్ని ఆదుకున్న రెవెన్యూ ఉద్యోగులు…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు అర్బన్ మండలంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న కీ. శే. శ్రీ టి. మహమ్మద్ హుస్సేన్ ఈ నెల 6వ తేదీన అనారోగ్యం కారణముగా ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత విషాదకరం. మృతుని కుటుంబాన్ని ఆదుకునేందుకు, జిల్లా పరిపాలన యంత్రాంగం, రెవెన్యూ శాఖ అధికారులు తక్షణమే కదిలేలా APRSA సంఘం యొక్క నాయకులు విశేష చొరవ తీసుకున్నారు.మృతుని కుటుంబానికి జీవనాధారంగా నిలిచే విధంగా, అర్హుడైన ఆయన కుటుంబ సభ్యుడు శ్రీ షేక్ మౌలాలి భాషకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి మేడం చేతుల మీదుగా నియామక పత్రం అందజేయబడింది. అదేవిధంగా జోహారాపురం గ్రామంలోని సర్వే నెం.68/2లో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. మృతుడు మరణించిన రోజునే జిల్లా కలెక్టర్ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50,000 నగదు మరియు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.25,000 అందజేశారు. రెవెన్యూ కుటుంబ సభ్యుడైన శ్రీ మహమ్మద్ హుస్సేన్ కుటుంబాన్ని ఆదుకోవడంలో రెవెన్యూ శాఖలోని అన్ని స్థాయిల అధికారులు, APRSA ఉద్యోగ సంఘాల నాయకులూ మరియు వీఆర్ఓ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుని, మృతిచెందిన ఐదు రోజుల వ్యవధిలోనే ఉద్యోగ నియామకం జరిగేలా కృషి చేయడం అభినందనీయమైన విషయం.రెవెన్యూ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని గ్రామ స్థాయి నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న అధికారులు, APRSA ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. అలాగే మృతునికి సంబంధించిన ప్రభుత్వ పరమైన బకాయిలు, ఇతర ప్రయోజనాలు చట్టపరమైన నిబంధనలకు లోబడి త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు.మృతుని విషాదాన్ని కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాజకీయ రంగు పులమేందుకు ప్రయత్నించడం బాధాకరం. ఇలాంటి చర్యలను మానుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా అనే అంశంపైనే అందరూ దృష్టి సారించాలని APRSA ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.మృతుని కుటుంబానికి అత్యంత తక్కువ సమయంలో ఉద్యోగ నియామకం, ఆర్థిక సహాయం మరియు ఇతర సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి మేడం కి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకటనారాయణమ్మ మేడం కి, జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీ రవికుమార్ సార్ కి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో APRSA జిల్లా అధ్యక్షులు శ్రీ సి. నాగరాజు, APRSA జిల్లా కార్యదర్శి శ్రీ లక్ష్మీరాజు మరియు వెంకటేశ్వర రెడ్డి, APRSA కర్నూలు డివిజన్ అధ్యక్షులు శ్రీ వి. రామాంజనేయులు, APRSA డివిజన్ కార్యదర్శి శ్రీ వేణుగోపాల్ రావు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు శ్రీ వెంకటరాజు, కలెక్టరేట్ యూనిట్ కార్యదర్శి లోకేశ్వర రెడ్డి, గ్రేడ్–1 వీఆర్వోల సంఘం అధ్యక్షులు శ్రీ సూరిబాబు మరియు వారి బృందం, గ్రేడ్–2 సంఘం అధ్యక్షులు శ్రీ ఆనంద్ మరియు వారి బృందం తదితరులు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా శాఖ, కర్నూలు డివిజన్ శాఖ, కలెక్టరేట్ యూనిట్ శాఖ & గ్రేడ్–1 & గ్రేడ్–2 గ్రామ రెవిన్యూ అధికారి సంఘం ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.


