జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ పిల్లలకు బ్యాగులు పంపిణి
1 min read
ముఖ్యఅతిథిగా హాజరై పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి
జర్నలిస్టుల సంక్షేమ సేవా కార్యక్రమాల పై ఎంఎల్ఏ ప్రశంసలు
అక్షర స్కూల్స్ చైర్మన్ సురేంద్రా, డైరెక్టర్ అర్చన చౌదరి లను అభినందించిన ఎమ్మెల్యే ,యూనియన్ నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు అక్షర స్కూల్స్ సహకారంతో స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం గురువారం ఏలూరులో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఎస్టి జబీర్ , వై.వి.హరీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కో- ఆప్షన్ సభ్యులు పెద్దబాబు,మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్థసారధి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా నిలిచే జర్నలిస్టుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు పోరాడుతామని హామీ ఇచ్చారు.జర్నలిస్టుల పిల్లలకు అక్షర స్కూల్స్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం ద్వారా విద్యారంగానికి సహకరిస్తున్నందుకు అక్షర స్కూల్స్ చైర్మన్ సురేంద్రాను, డైరెక్టర్ అర్చన చౌదరి ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది అని జర్నలిస్ట్ పిల్లలకు ఇలాంటి సహకారం అందించడం అభినందనీయం అని, ఇంతటి సేవ కార్యక్రమాన్ని కొనసాగించిన యూనియన్ నాయకులను వారి కృషిని కొనియాడారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, జర్నలిస్టులకు అనేక విధాలుగా సహకారం అందిస్తున్న APWJF, APBJA యూనియన్ల కృషిని ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో.ఏలూరు ప్రసారం అధ్యక్షులు డి వి రమణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు పి. నారాయణ,ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన అక్రిడేషన్ కమిటీ మెంబర్ కళ్యాణ్,ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు.పిల్లి.మిల్టన్ ప్రతాప్,చేదలవాడ ప్రతాప్, ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు వీరగట్టం. జయరాం,సతీష్ ,వెంకట్రావు, ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్టులు ప్రింట్ మీడియా జర్నలిస్టులు తదితర జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.స్కూల్ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.అక్షర స్కూల్స్ అందించిన స్కూల్ బ్యాగులను అందుకున్న జర్నలిస్ట్ పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు.


