NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి

1 min read

ఆలూరు న్యూస్ నేడు: కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వైకుంఠం జ్యోతి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులు, మహిళలు, యువత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి, రాష్ట్ర పురోగతి కోసం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని, ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

About Author