NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్యాపిలి మండలంలోని 27 మంది దివ్యాంగ (ప్రత్యేక అవసరాలు గల) పాఠశాల విద్యార్థులకు శుక్రవారం మండల విద్యాశాఖాధికారులు కె. మహేశ్వర రెడ్డి , శ్రీ ఎస్. వెంకటేశ్వర నాయక్  చేతుల మీదుగా వివిధ రకాల సహాయక ఉపకరణాలను ఘనంగా పంపిణీ చేశారు.ప్యాపిలి ​మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన దివ్యాంగ పిల్లల అవసరాలకు అనుగుణంగా వీల్ చైర్స్, రోలేటర్లు, అంధ విద్యార్థులకు బ్రెయిలీ కిట్స్, అలాగే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల మానసిక వికాసానికి ఉపయోగపడే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్  కిట్లను ఈ సందర్భంగా అందజేశారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం అందిస్తున్న ఈ పరికరాలను తల్లిదండ్రులు సక్రమంగా ఉపయోగించాలని కోరారు. వీటి సహాయంతో పిల్లలను రెగ్యులర్‌గా పాఠశాలలకు పంపించి, వారు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భౌతిక లోపాలు చదువుకు అడ్డంకి కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపకరణాలు అందుకున్న దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులతో పాటుప్రత్యేక ఉపాధ్యాయులు: రమేష్ నాయుడు, ప్రసాద్ నాయుడుబీసీ స్కూల్ ఉపాధ్యాయులు మరియు సీఆర్‌పీలు: నవీన్, రామాంజనేయులు, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author