NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం లో ఉద్రిక్తత

1 min read

టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఇంటి ముందు వైకాపా కవ్వింపు చర్యలు

తుఫాన్ వాహనం, ద్వీచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన టిడిపి నాయకులు

టిడిపి వైకాపా పరస్పర వాగ్వివాదం

ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రశాంతంగా ఉన్న మంత్రాలయం మండలం లో ఒక్క సారి గా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైకాపా పార్టీ ల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో మాధవరం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోసిగి లో చంద్రబాబు వెన్ను పోటు కు రెండేళ్లు కార్యక్రమంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు వైకాపా నాయకులు వాహనాలలో బయలుదేరారు. అయితే మాధవరం గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఇంటి ముందు వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. ఇంటి ముందు బాణాసంచా కాల్చి కేకలు వీలలు వేసుకుంటు వైకాపా జెండాలు ఎగురవేస్తూ రెచ్చగొడుతూ వెళ్లారు. దీంతో రెచ్చిపోయున టిడిపి నాయకులు కోసిగి లో కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న వైకాపా నాయకుల వాహనాలను ద్వీచక్ర వాహనాలను మాధవరం లో అడ్డగించి వాగ్వివాదానికి దిగి ఒక తుఫాన్ వాహనం, ద్వీచక్ర వాహనాలకు నిప్పు పెట్టడం తో బూడిదయ్యాయి. దీంతో వైకాపా నాయకులు పరుగులు తీశారు.   విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు : -ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన వర్గం తో మాధవరం రావడానికి వస్తుండగా బసాపురం దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొత్త రాంపురం దగ్గర ఎవరు రాకుండా రోడ్డు కు రాళ్లు అడ్డుపెట్టారు. మరో సారి ఘటన పునరావృతం కాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, ఎవరు అతిక్రమించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు.ఇన్చార్జ్ ఇంటి దగ్గరకు చేరుకున్న టిడిపి నాయకులు : – దాడి ఘటన తెలుసుకున్న టిడిపి నాయకులు ఒక్క సారి గా మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఇంటికి టిడిపి నాయకులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడ భారీ గా పోలీసులు మొహరించారు. మాధవరం సర్కిల్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు బయాందోళనలు చెందుతున్నారు.

About Author