NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంధనాన్ని పొదుపు చేద్దాం, ప్రజా రవాణాను వాడదాం”

1 min read

ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆదర్శంగా నిలిచిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, జేసీ నూరుల్ ఖమర్

కర్నూలు, న్యూస్​ నేడు: ఇంధన వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన ఇంధన పొదుపు (Fuel Conservation) చర్యల్లో భాగంగా ఒక్క నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించేందుకు ప్రభుత్వ వాహనంలో కాకుండా ఆర్టీసీ బస్సులో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రయాణించి ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది, ప్రజలు ఇంధన పొదుపు చర్యల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.. సాధ్యమైనంత వరకు వ్యక్తిగత వాహనాలను తగ్గించి, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను వాడటం అలవాటు చేసుకోవాలన్నారు.  మన సొంత రవాణా సంస్థ అయిన ఆర్టీసీ బస్సులను ఆదరించడం ద్వారా పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, ప్రభుత్వ సంస్థలు బలోపేతం అవుతాయన్నారు కలెక్టర్ తో పాటు డి ఆర్ డి ఏ పిడి రమణ రెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ మనోహర్, ఆర్టీసీ ఆర్ ఎమ్ శ్రీనివాసులు, డి ఎస్ ఓ రాజా రఘువీర్, డి పి ఓ భాస్కర్, డ్వామా ఏపిడి మాధవి,  తదితరులు పాల్గొన్నారు.

About Author