నూజివీడు ట్రిపుల్ ఐటీ కి ఏనుగమర్రి పాఠశాల విద్యార్థుల ఎంపిక
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ఇటీవల జరిగిన 10 వ తరగతి ఫలితాల లో అద్భుతమైన విజయాలను సాధించిన ఏనుగుమర్రి పాఠశాల విద్యార్థులు పి. రాగనిత్య మరియు ఎం. మనీషా ఇరువురికి నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంప్స్ లో సీట్లు రావడం మరియు ఎం. గీతాలహరి అంబేద్కర్ గురుకుల పాఠశాల, ఏలూరు నందు సీటు సాధించినది . అలాగే పి. హర్షవర్ధన్ మరియు ముగ్గురు విద్యార్థినులు అర్. డి.టి., అనంతపురం వారు సహాయంతో పై చదువులకు ఇంటర్మీడియెట్ కు గాను ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానో పాధ్యాయలు యు.ఎం. రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్థులు హర్షం వెలిబుచ్చారు. ఈ విషయం తమ పాఠశాల ఉపాధ్యాయ బృందం అంకిత భావానికి నిదర్శనమని భవిష్యతోలో ఇలాటి విజయాలను కొనసాగిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యా కమిటీ చైర్మన్ మహేంద్ర, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

