NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయవంతమైన పాలన సభకు కదిలిన తెలుగు తమ్ముళ్లు

1 min read

కూటమి ప్రభుత్వ రెండేళ్ల

హోళగుంద న్యూస్ నేడు: విజయవంతమైన పాలన సందర్భంగా కర్నూలులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మరియు వైకుంఠం శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ జనసమీకరణ విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ మరియు ప్రదర్శనలో పార్టీ సీనియర్ నాయకుడు చిన్న హట్ట శేషగిరి పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఆలూరు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.ర్యాలీ సందర్భంగా “జై తెలుగుదేశం… జై జై తెలుగుదేశం”, “జై వైకుంఠం… జై జై వైకుంఠం” అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. కార్యకర్తల ఉత్సాహం, క్రమశిక్షణ పార్టీ బలాన్ని మరోసారి చాటిచెప్పాయి.కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరియు కర్నూలు సభను విజయవంతం చేసేందుకు ఆలూరు తెలుగు తమ్ముళ్లు చూపిన ఉత్సాహం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభ విజయవంతానికి సహకరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *