NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభకు తరలిన టీడీపీ శ్రేణులు

1 min read

హోళగుందన్యూస్ నేడు:  హోళగుంద మండలం నుండి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్నూలుకు తరలివెళ్లారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.కర్నూలులోని కన్వెన్షన్ సెంటర్ – బైరెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించిన ఈ సభలో హోళగుంద మండలానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహాన్ని చాటారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హోళగుందమండల టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *