చెత్త తొలగింపులో..స్పందించిన అధికారులు
1 min read
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: పత్రికల్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో ఉన్న చెత్తాచెదారాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.శివకళ్యాణ్ సింగ్ చెత్తను తొలగించారు.గ్రామంలో పైపాలెం గ్రామ రస్తాలో ఉన్న సుంకులమ్మ గుడి దగ్గర పేరుకుపోయిన చెత్తచెదారాన్ని సోమవారం ఉదయం పంచాయతీ కార్యదర్శి పోక్లేయిన్ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా చెత్తను తొలగించి గ్రామానికి దూరంలో వేయించారు.చెత్తను తీసివేయడం వల్ల ఆ ప్రాంతం శుభ్రంగా ఉంది.ఆదివారం పలు పత్రికల్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించడంతో గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

