NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిర్యాదులు పరిష్కారంలో అధికారులు ప్రత్కేక శ్రద్ధ తీసుకోవాలి

1 min read

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అర్జీలకు చక్కని పరిష్కారం చూపాల

దివ్యాంగుని చెంతకు స్వయంగా వెళ్ళి అర్జీని స్వీకరణ

సమస్యలను అడిగి తెలుసుకుని భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి                     

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా  కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేటులోని గోదావరి సమావేశ మందిరంలో  సోమవారం  ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా:యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి డిఆర్వో ఎల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్,ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి లు  ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు స్వీకరించిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్ణీత గడువు లోపుగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీలు నాణ్యత పరిష్కారంతో, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో వెళ్ళి లబ్ధిదారులుతో నేరుగా మాట్లాడి సమస్యలను  అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీలుపై శాఖలు వారీగా అధికారులు సమీక్షలు నిర్వహించి, సమస్యలు పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *