NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుందలో కామధేను మెడికల్ ఏజెన్సీ ఘన ప్రారంభం

1 min read

ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కామధేను మెడికల్ ఏజెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఏజెన్సీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏజెన్సీ నిర్వాహకులు సబీర్, శరణ హసన్ ఈబీజీ గోవింద్ గౌడ్‌తో పాటు టీడీపీ మైనారిటీ మండల అధ్యక్షుడు ముల్లా మొయిన్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.అనంతరం మాట్లాడిన ఈబీజీ గోవింద్ గౌడ్, గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో మెడికల్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కామధేను మెడికల్ ఏజెన్సీ ప్రజలకు విశ్వసనీయ సేవలు అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.స్థానిక ప్రజలకు అవసరమైన మందులు, వైద్య ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉండేలా ఈ ఏజెన్సీ సేవలు అందించనున్నందుకు నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో టైలర్ చాంద్ బాషా, చినిగి వీరేష్ తదితరులు పాల్గొని నూతన సంస్థ విజయవంతంగా ముందుకు సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *