NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుంద నూతన ఎంపీడీవో కు ఎస్‌డీపీఐ నాయకుల ఘన సన్మానం

1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ ఉమర్‌ను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్. అబ్దుస్ సుభాన్ మాట్లాడుతూ, మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎంపీడీవో సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజా అవసరాల పట్ల స్పందిస్తూ పారదర్శక పరిపాలన అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్‌డీపీఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, ప్రధాన కార్యదర్శి ఎం. హఫీజ్, కార్యదర్శి కె. అబ్దుల్ రెహ్మాన్, కోశాధికారి బి. అల్లా బకాష్, హోళగుంద ఎంపీపీ తనయుడు ఈసా పాల్గొని నూతన ఎంపీడీవోకు శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన బాధ్యతలు చేపట్టిన సయ్యద్ ఉమర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించిన ఎస్‌డీపీఐ నాయకులు, మండల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.హోళగుంద మండల ప్రజల అభ్యున్నతి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *