NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీమద్ది ఆంజనేయ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

1 min read

108 ప్రదక్షణలు చేసి మొక్కుబడులు

సుమారు 3321 భక్తులకు నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ

వివిధ సేవల రూపేణా రూ.3,33,961/-లు ఆదాయo

సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు,వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.3-00 వరకూ విచ్చేసిన సుమారు 3321 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.3-30 ని.ల వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.3,33,961/-లు ఆదాయము వచ్చినది. ఈ కార్యక్రమములలో ఆలయ ధర్మకర్తలు  ఓబిళ్ళనేని సూర్యభవానీ,చింతపల్లి రత్నసురేష్ ,ధూళిపాళ్ల సూర్యచంద్ర వెంకట ప్రభాకరరావు,వల్లూరి సునీత, తిరుమలశెట్టి నాగ వరలక్ష్మి అనీల,దూనబోయిన నారాయణ మూర్తి  మరియు ఆలయ ఎక్స్.అఫిషియో మెంబర్ వేదాంతం వెంకటాచార్యులు వారు పాల్గొనినారు. అనంతరం కార్యాలయ భవనం నందు శ్రీ స్వామి వారి దేవస్థానం మాస్టర్ ప్లాన్ పరిశీలించి, సదరు మాస్టర్ ప్లాన్ అనుసరించి చేయవల్సిన వివిధ అభివృద్ది పనుల గురించి కార్యనిర్వహణాధికారిణి మరియు ధర్మకర్తలు చర్చించియున్నరు. శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యములూ కలుగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు  ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ మరియు ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన తెల్పినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *