ఓటర్ల హక్కుల పరిరక్షణలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
1 min read
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి బూత్ స్థాయి ప్రతినిధిదే
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ
ప్రక్రియపై హోళగుందమండలంలో విస్తృత సమీక్ష నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలం, ఆలూరు నియోజకవర్గంఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి పేర్కొన్నారు.ఈరోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలంలోని నేరణికి తండా, కొత్తపేట, నేరణికి, ఎల్లర్తి, చిన్న హట్ట, పెద్ద హట్ట, సమితిగేరి, కొగిలతోట, ముద్దటమాగి గ్రామాలకు చెందిన బీఎల్ఏలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి హాజరై ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాటించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడటం ప్రతి బీఎల్ఏ బాధ్యత అని పేర్కొంటూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ఏ చర్యనైనా క్షేత్రస్థాయిలోనే అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం, అనర్హులను చేర్చడం, బూత్ స్థాయి మ్యాపింగ్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి లోపాలు లేదా అక్రమాలు కనిపించినా వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని గుర్తు చేసిన ఎమ్మెల్యే , ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఆ హక్కును హరించే ఏ కుట్రనైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి తిప్పికొడుతుందని స్పష్టం చేశారు.సమావేశంలో బీఎల్ఏలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించిన పలు అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, అభ్యంతరాల నమోదు, చిరునామా మార్పులు, ఓటర్ల ధృవీకరణ, స్వీయ మ్యాపింగ్, ప్రాక్సీ మ్యాపింగ్, దరఖాస్తుల పరిశీలన వంటి అంశాలపై వివరంగా చర్చించారు. ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం అప్రమత్తంగా పనిచేయాలని, ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని బీఎల్ఏలకు సూచించారు.రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా వ్యవహరిస్తాయని ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, కో-కన్వీనర్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బూత్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు మరియు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


