NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల యోగా ర్యాలీ

1 min read

యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:గుత్తా గిరిబాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించారు. ర్యాలీని ప్రారంభిస్తూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ “యోగా” భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద అని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు మరియు అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా యోగా ప్రాముఖ్యతను తెలియజేసే నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. కార్యక్రమాన్ని అధ్యాపకులు టి వెంకట దుర్గాప్రసాద్ మరియు డాక్టర్ ఎం విజయ కుమార్ సమన్వయం చేయగా వైస్ ప్రిన్సిపల్ కె అజయ్ కుమార్ అధ్యాపకులు వి వెంకట్రావు , డాక్టర్ ఎం రాంబాబు,ఎస్ పరమేశ,ఎం కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *