NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని రమ్య కు ఎమ్మెల్యే సన్మానం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల జిల్లా టాపర్‌గా నిలిచిన విద్యార్థిని రమ్యతో పాటు ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థులనుడోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కూడా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున ,మాజీ డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనారాయణమూర్తి, తెదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి  ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పి శ్రీనివాసులు, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా పీర్ , మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగటిపల్లి మధు, ఏపీ ఎస్టి సెల్ అధికార ప్రతినిధి మధు కుమార్, మాజీ ఎంపీటీసీ గొల్ల రామ్మోహన్ యాదవ్, తెదేపా నాయకులు చల్లా వీరాంజనేయులు, గుడిపాడు వెంకటరెడ్డి, కమతం భాస్కర్ రెడ్డి, రాజా రవి, వెంకటేష్,ఎన్ రంగాపురం ఆర్ సి మద్దిలేటి, తేదేపా నాయకులు కార్యకర్తలు మరియు కాలేజీ లెక్చరర్స్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *