కూటమి ఘన విజయంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది
1 min read
ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు ఎం ఎల్ ఏ కి వినతిపత్రం అందజేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు తమ సమస్యలను వినిపించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందనీ, 2014 -19 మధ్యకాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగుల జీతభత్యాలను గణనీయంగా పెంచి వారి కుటుంబాలకు అండగా నిలిచిందని,గత ఐదేళ్ల గొడ్డలి పార్టీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు చేపట్టకపోవడం ఆ ప్రభుత్వాల దుర్మార్గానికి నిదర్శనమని, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతోనే కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందని,ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

