కౌలు రైతులు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి
1 min read
నందికొట్కూర్ ఎంఏవో షేక్ షావలి..
నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరు మండలంలో ఉన్న రైతులు పొలమును కౌలుకు తీసుకున్న రైతులు తప్పనిసరిగా కౌలు రైతులందరూ క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు (సీసీఆర్సీ)కు దరఖాస్తులు చేసుకోవాలని నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి పి షేక్షావలి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం ఎంఏఓ మాట్లాడుతూ మీ సమీప రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కౌలు రైతులకు ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలు, వ్యవసాయ రుణాలు,పంటల బీమా,ఇన్‌ఫుట్ సబ్సిడీ,అన్నదాత సుఖీభవ, ఎరువులు తదితర సౌకర్యాలు పొందేందుకు సీసీఆర్‌సీ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.సాగు చేస్తున్న భూమికి సంబంధించిన వివరాలు ఆధార్ కార్డు మరియు ఇతర అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని భూ యజమానులు మరియు కౌలు రైతులు పరస్పర సహకారంతో సీసీఆర్‌సీ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా దరఖాస్తులు సమర్పిస్తే సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.మండలంలోని అర్హులైన కౌలు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతులను కోరారు.

