NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుగ్గిరాల ఫ్లైఓవర్ వద్ద రోడ్డు భద్రతా చర్యలు  కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు

1 min read

సర్వీస్ రోడ్ల నుండి హైవేకి అనుసంధానమయ్యే మార్గంలో విసిబిలిటీ లోపించడం వల్ల తరచుగా ప్రమాదాలు

ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో దుగ్గిరాల ఫ్లైఓవర్ వద్ద రోడ్డు భద్రతా చర్యలు  కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు.ఏలూరు సమీపం లోని దుగ్గిరాల ఫ్లైఓవర్ కింద, సర్వీస్ రోడ్ల నుండి హైవేకి అనుసంధానమయ్యే మార్గంలో వి్సిబిలిటీ లోపించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నరు. గతంలో ఇక్కడ కాలేజీ బస్సు ప్రమాదం వంటి దురదృష్టకర సంఘటనలు జరిగిన నేపథ్యంలో, ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దుగ్గిరాల ఫ్లైఓవర్ కింద అత్యాధునిక ‘కాన్వెక్స్ మిర్రర్స్  ఏర్పాటు చేశారు.మలుపుల వద్ద మరియు హైవేకి ఎక్కే మార్గాల్లో వాహనదారులకు అవతలి వైపు నుండి వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించేలా చేయడంజరిగింది.బ్లైండ్ స్పాట్స్  ని తొలగించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను మరియు సంఖ్యను తగ్గించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు మరియు విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.సామాజిక బాధ్యతతో సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ వారు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమన్నరు.ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్  కోటేశ్వరరావు ఏలూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు  మరియు సిబ్బంది,ఏఈ మహేష్ (డిటి ఆర్ బి, ఎన్ హెచ్ -16), పీఆర్ఓ రామరాజు, సెయింట్ జోసెఫ్ డెంటల్ & నర్సింగ్ కాలేజ్ ప్రతినిధులు రెవ. ఫాదర్ పి. జాకబ్ కరస్పాండెంట్ & సెక్రటరీ, ఎస్ జెడిసి  రెవ.ఫాదర్ కె. జోసెఫ్ అడ్మినిస్ట్రేటర్,ఎస్ జెడిసి రెవ. ఫాదర్ రాజు కరస్పాండెంట్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్డా. ఎన్. స్లీవా రాజు (ప్రిన్సిపల్), డా.ఎ.అనూరాధ, డా.ఎ.అరుణ్ వైస్ ప్రిన్సిపల్స్ డా. ఎం. పావన సంధ్య ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్  డా.టి. ప్రశాంత్ ఎన్ ఎస్ ఎస్, ఎపిఓ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ సిబ్బంది మరియు రోవర్స్ బృందం.పోలీసు శాఖ,విద్యాసంస్థల సమన్వయంతో చేపట్టిన ఈ భద్రతా చర్యలు వాహనదారుల ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఎంతో మేలు చేకూరుస్తాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *