వృద్ధుల హక్కులు, రక్షణ పై అవగాహన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి సూచనల మేరకు 19-06-2026 న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కర్నూల్ సాయి నగర్, పుల్లయ్య కాలేజీ దగ్గర గల షిరిడి సాయి వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధుల హక్కులు, రక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించారు.జడ్జి మాట్టాడుతు వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష, వేధింపులు,శారీరక, మానసిక, ఆర్థిక మరియు నిర్లక్ష్యంపై సమాజంలో అవగాహన కల్పించడం మరియు వారికి తగిన రక్షణ కల్పించడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.వృద్ధులకు కావలసిన ఉచిత న్యాయ సహాయం కొరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు అని తెలిపారు. తల్లిదండ్రు ల మరియు వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 గురించి అక్కడి వృద్ధులకు వివరించారు. వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లలనుండి జీవన భృతి పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తుందని తెలిపారు.ఈ చట్టం ఆదేశాలను పిల్లలు ఉల్లంఘిస్తే జరమానా లేదా జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. వృద్ధుల సహాయర్థం ప్రతి వృద్ధాశ్రమం లందు, షెల్టర్ హోమ్స్ నందు, బ్యాంకుల నందు, రెవిన్యూ ఆఫీస్ లందు ప్యారా లీగల్ వాలెంటీర్స్ చేత హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడమైనది అని తెలిపారు.వీరు వృద్ధులకు సంబంధించిన లీగల్ ఎయిడ్ అప్లికేషన్లను తయారు చేయడంలోనూ వెల్ఫేర్ స్కీములను వివరించడంలోనూ పిల్లలనుండి మెయింటినెన్స్ పొందేందుకు కావలసిన మార్గదర్శకాలను తెలుపడం లోను సహాయ పడుతారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే తన సంస్థకు తెలుపగలరు అని తెలిపారు. ఈ సదస్సు లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయ వాది శివరామ చంద్రరావు, షిరిడి సాయి వృద్ధ ఆశ్రమం నిర్వాహకులు, ప్యారా లీగల్ వాలెంటీర్స్, వృద్ధులు పాల్గొన్నారు.

