సీనియర్ పాత్రికేయుడు కొండేపూడి సత్యనారాయణ మృతి
1 min read
పాత్రికేయ రంగానికి తీరని లోటు : బీఎస్పీ
అమలాపురం, న్యూస్ నేడు : చెందిన సీనియర్ పాత్రికేయులు కొండేపూడి సత్యనారాయణ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందడం పాత్రికేయ రంగానికి తీరని లోటని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పొలమూరి మోహన్‌బాబు సందర్శించారు. శనివారం ఆయన సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, భార్య, కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొండేపూడి సత్యనారాయణ పాత్రికేయ రంగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ప్రజా సమస్యల పట్ల ఎల్లప్పుడూ స్పందిస్తూ, ఏ సమస్యనైనా తనదైన శైలిలో వార్తగా ప్రజల ముందుకు తీసుకువచ్చేవారని తెలిపారు.ఆయన రాసిన వార్తలు ప్రచురితమైన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేవారని గుర్తుచేశారు. తన వృత్తి జీవితమంతా నిజాయితీ, నిబద్ధతతో జర్నలిజాన్ని కొనసాగించారని, జీవితాంతం విలువలకు కట్టుబడి పనిచేశారని అన్నారు. అంతటి సేవ చేసినప్పటికీ తన జీవితకాలంలో సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో వాకపల్లి హరీష్‌కుమార్, శ్రీనివాస్, కుమారి తదితరులు పాల్గొన్నారు.

