NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల యోగా

1 min read

యోగా వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది

 కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా కార్యక్రమన్ని నిర్వహించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు మాట్లాడుతూ-యోగా వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని,”యోగా” భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద అని,ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం యోగా గురువు డా. ఆదినారాయణ విద్యార్థులచే యోగాసనాలు వేయించి,యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు.విద్యార్థులు మరియు అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా యోగా సాధనలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అధ్యాపకులు టి వెంకట దుర్గాప్రసాద్  సమన్వయం చేయగా వైస్ ప్రిన్సిపల్ కె అజయ్ కుమార్ , సిపిడిసి కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు అధ్యాపకులు వి వెంకట్రావు,డాక్టర్ ఎం రాంబాబు,డా.ఎం విజయ కుమార్,ఎస్ పరమేశ,ఎం కృష్ణ చైతన్య,డా.పిఆర్ కావ్య శ్రీ,ఎస్ సుస్యలత,డి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

About Author