NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి జన్మదిన వేడుకలు

1 min read

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డీఎస్పీ వెంకటరామయ్య, సీఐలు, ఎస్సైలు

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి  జన్మదిన సందర్భంగా వారి నివాసంలో శనివారం ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరామయ్య మర్యాదపూర్వకంగా నివాసానికి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ఆలూరు, ఆస్పరి, దేవనకొండ మండలాల సీఐలు, చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి పోలీస్ స్టేషన్ల ఎస్సైలు సైతం జ్యోతమ్మక్కను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో జ్యోతమ్మక్క కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి ఆశీస్సులు, అభిమానంతో మరింత ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని జ్యోతమ్మక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకలు సంతోషకర వాతావరణంలో ఘనంగా జరిగాయి.

About Author