NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదిత్య డిగ్రీ కళాశాలలో యోగా డే యోగా శిక్షణా తరగతులు

1 min read

పురాతన జీవన విధానం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రక్షణ లో కీలక పాత్ర

యోగా వల్ల శారీరక దృఢత్వం,మానసిక ప్రశాంతత లభిస్తుంది

కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వర రావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆదిత్య డిగ్రీ కళాశాల. సత్రంపాడు ఏలూరులో  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వర రావు  తెలిపారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ భారతదేశం నుండి ప్రారంభమైన ఈ పురాతన జీవన విధానం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రక్షణ లో కీలక పాత్ర పోషిస్తుందని,యోగా వల్ల శారీరక దృఢత్వం,మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.   ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసీన పుట్ట ధనుంజయులు (ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)  యోగా మనసు శరీరం ,ఆత్మల మధ్య సమతుల్యం సాధించడానికి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న కే రామకృష్ణ (వివేకానంద కేంద్ర) మాట్లాడుతూ అనారోగ్య సమస్యల నివారణకు ,మానసిక ప్రశాంతతకు ,ఏకాగ్రతకు యోగాసనాలు ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో వివేకానంద కేంద్ర సభ్యులు కేవీ బాలాజీ మరియు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డి వి వి ఫణి కుమార్  ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కే హరిబాబు మరియు కల్చరల్ కో ఆర్డినేటర్ పి సౌభాగ్య లక్ష్మీ అధ్యాపక,అధ్యాపకేతర బృందం , ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author