అధికారులు తూర్పు కాపులకు బి.సి.డి సర్టిపికెట్లు జారీ చెయ్యాలి
1 min read
కోలా భాస్కరరావు, అధ్యక్షులు, తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం
ఏలూరు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వలస వఛ్చిన తూర్పు కాపులకు అధికారులు ఇబ్బందులకు గురించేయక తూర్పు కాపు బి. సి.డి సర్టిపికెట్లు జారీ చెయ్యాలని, మరియు వారికీ ఓ. బి.సి. గా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చెయ్యాలని తూర్పు కాపు అభివృద్ధి, సంక్షేమ సేవ సంఘం గౌరవ అధ్యక్షులు కోలా భాస్కరరావు ఏలూరు జిల్లా కలెక్టర్ కి తన వినతి ద్వారా కోరారు. తూర్పుకాపు జి.ఓ No.62, గ్రూప్ డి, సీరియల్ నం. 30 ప్రకారం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వలస వచ్చిన తుర్పు కాపులకు మైగ్రేషన్ టి.సి. లో తూర్పుకాపు గా ఉన్న వారిని, గతంలో తహసీల్దార్,తూర్పుకాపు కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నవారిని అధికారులు ఎటువంటి ఇబ్బంది పెట్టక,కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి వారికి విద్య, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అండేందుకు మరియు తూర్పుకాపులను ఓ. బి.సి. లుగా గుర్తించేందుకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చెయ్యాలని వెంకబడిన తూర్పు కాపు కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కి ఏ. ఓ.ఎన్.వి నాంచారయ్య, సంఘ గౌరవ అధ్యక్షులు కోలా భాస్కరరావు,బిసి సంఘ నాయకులు సిరిగిబత్తిన శ్రీధర్, పిట్ల సాయిబాబా,యెల్లపు మురళి కృష్ణ వినతి ద్వారా కోరారు. కోలా భాస్కరరావు, అధ్యక్షులు, తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం.

