NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్నపాటి వర్షానికి చెరువులా రోడ్డు

1 min read

పాలకులు మారుతున్నా మారని తలరాతలు

-సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు..

నందికొట్కూరు న్యూస్ నేడు: చిన్నపాటి వర్షానికే మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న రోడ్డు చెరువులా తలపిస్తోందని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు బస్టాండ్ ఏపీజీబీ బ్యాంక్ దగ్గర డ్రైనేజీ సరిగా లేక సిమెంట్ రోడ్డును మంగళవారం పరిశీలించారు.సిమెంట్ రోడ్డును ఎత్తు పెంచి డ్రైనేజీ కాల్వలు ఏర్పాటు చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.రోడ్డుపై ఆగి ఉన్న నీటిని పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు.వర్షపు నీరు,అడుగు లోతు నీరు నిలబడడం వల్ల వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వాలు,పాలకులు మారుతున్నా ప్రజల తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా వెంటనే అధికారులు స్పందించి రహదారిని ఏర్పాటు చేసి రోడ్డు పక్కన డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.లేకపోతే ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మేకల చంద్రశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *