NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

49బన్నూర్’లో బోర్ ను ప్రారంభించిన నాయకులు

1 min read

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో బుధవారం సాయంత్రం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రమణారెడ్డి, సోపిసాహెబ్ నూతన త్రాగునీటి బోర్ ను ప్రారంభించారు.గ్రామ ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా ఉండేందుకు గాను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఎమ్మెల్యే బోర్ వేయించగా నాలుగు ఇంచుల నీళ్లు పడ్డాయని నాయకులు అన్నారు.ఎమ్మెల్యే మరియు నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి సహకారంతో నూతన బోర్ బోర్ నుండి నూతన పైపులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుకు నాలుగు లక్షల రూపాయలతో కనెక్షన్ ఇవ్వడంతో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయని రమణారెడ్డి,సోపిసాహెబ్ అన్నారు.ఎమ్మెల్యేకు మరియు శివానందరెడ్డికి నాయకులు మరియు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో వెంకటరమణ,యోగేంద్ర రెడ్డి,సాయిబా,సురేష్, తారకేశ్వర్ రెడ్డి, రామకృష్ణుడు,లక్ష్మీదాసు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *