NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాక్సింగ్ క్రీడకు ఎల్లవేళలా సాహయా సహకారాలు అందిస్తాం

1 min read

మాంటిస్సోరీ విద్యాసంస్థల  అధినేత  డాక్టర్  కె. కృష్ణమోహన్ 

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక నగరంలో బుధవారం మాంటేశ్వరి స్కూల్ నందు బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. బాక్సింగ్ పోటీలకు గౌరవ ముఖ్య అతిథిగా డాక్టర్ కె. కృష్ణమోహన్  హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఒలింపిక్ డే సందర్భంగా పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, బాక్సింగ్ క్రీడల పోటీల్లో పాల్గొని కర్నూలుకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. బాక్సింగ్ క్రీడకు ఎల్లవేళలా సాహయా సహకారాలు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కార్యదర్శి టి. తేజ, బాక్సింగ్ శిక్షకులు బి .నాగరాజ్,  టీ.వెంకటేశ్వర్లు  టి.అజయ్ మధు, మనోహర్, సతీష్ కుమార్, శివమణి, కాజా తదితరులు పాల్గొన్నారు.

About Author