NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడమే టిడిపి విజన్   

1 min read

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు  స్పష్టం   

న్యూస్ నేడు, పత్తికొండ:  2o47 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ న  అన్ని విధాల అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడమే టిడిపి యొక్క విజన్ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లోని జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, రాష్ట్ర మంత్రులు టీ.జి భరత్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, మరియు జిల్లా కు చెందిన ఎం.ఎల్.ఏలు కేఈ శ్యాం కుమార్, పార్థసారథి, బొగ్గుల దస్తగిరి తో  కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు రాయలసీమ రతనాలసీమగా వెలుగొందిందని తదనంతరం పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమగా మారిందని అన్నారు. నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశంతో తెలుగు రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు. రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. రాయలసీమ ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఏర్పాటుచేసిన హంద్రీనీవా పథకం నేడు లక్షల ఎకరాల సాగునీరు అందించే ప్రాజెక్టుగా తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. అనంతపురం కర్నూలు జిల్లాలను పారిశ్రామిక డబ్బులుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందన్నారు. జొన్నగిరిలో జియో మైసూర్ స్థాపించిన గోల్డ్ మైన్ ఈ ప్రాంతంలో 2000 మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. సంవత్సరానికి టన్ను బంగారం  ఉత్పత్తి చేసే కర్మాగారంగా దేశంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్ గా అవతరించబోతుందన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *