పెద్ద వక్క మింగిన మూడేళ్ల చిన్నారి
1 min read
ఎండోస్కోపీ ద్వారా విజయవంతమైన చికిత్స
మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు
కర్నూల్ హాస్పిటల్, న్యూస్ నేడు : కర్నూలుకు చెందిన 3 సంవత్సరాల బాలుడు అనుకోకుండా పెద్ద పరిమాణంలో ఉన్న వక్క (Betel Nut) మింగడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. వక్క మింగిన అనంతరం చిన్నారికి వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలుకు తీసుకువచ్చారు.జూన్ 6, 2026న ఆసుపత్రిలో చేరిన చిన్నారిని పీడియాట్రిషన్ & నీయోనటాలజిస్ట్ డా. కె. సింధూర పరిశీలించి అవసరమైన పరీక్షలు నిర్వహించారు. అనంతరం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపటాలజిస్ట్ డా. పి. అబ్దుల్ సమద్ ఎండోస్కోపీ ద్వారా పరీక్షించగా, సుమారు 2 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న వక్క గొంతులోని పోస్ట్ క్రికోయిడ్ ప్రాంతంలో (Post Cricoid Region) ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.చిన్నారి వయస్సు మరియు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనస్తీషియా (Anaesthesia) సహాయంతో ఎండోస్కోపిక్ విధానంలో Foreign Body Removal ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. వైద్య బృందం విజయవంతంగా వక్కను తొలగించి చిన్నారిని ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. చికిత్స అనంతరం చిన్నారిని పర్యవేక్షణలో ఉంచగా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా స్థిరపడింది. వాంతులు, అసౌకర్యం వంటి లక్షణాలు తగ్గిపోవడంతో చిన్నారి సాధారణ స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందంగా చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు. జూన్ 7, 2026న చిన్నారిని ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా డా. పి. అబ్దుల్ సమద్ మాట్లాడుతూ, చిన్న పిల్లలు వక్కలు, నాణేలు, చిన్న బొమ్మల భాగాలు, బ్యాటరీలు వంటి వస్తువులను అనుకోకుండా మింగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, తల్లిదండ్రులు ఇటువంటి వస్తువులను పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచాలని సూచించారు. ఏదైనా వస్తువు మింగిన అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు.డా. కె. సింధూర గారు మాట్లాడుతూ, పిల్లల్లో వాంతులు, మింగడానికి ఇబ్బంది, అధిక లాలాజలం కారడం, నిరంతర ఏడుపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు.అదేవిధంగా, చిన్నారి మొదటి ఫాలో-అప్ పరీక్ష కోసం నేడు (24 జూన్ 2026) ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు చిన్నారిని మళ్లీ పరిశీలించగా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని, ఆహారం తీసుకోవడం మరియు రోజువారీ కార్యకలాపాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్య బృందం వెల్లడించింది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “చిన్నారుల్లో చిన్న చిన్న వస్తువులని మింగడం అత్యవసర వైద్య పరిస్థితిగా పరిగణించాలి. సమయానికి సరైన నిర్ధారణ మరియు నిపుణుల చికిత్స అందితే క్లిష్ట పరిస్థితులను కూడా విజయవంతంగా ఎదుర్కోవచ్చు. మా పీడియాట్రిక్ మరియు గ్యాస్ట్రోఎంటరాలజీ బృందాలు సమన్వయంతో పనిచేసి చిన్నారికి సురక్షితమైన చికిత్స అందించాయి. పిల్లల ఆరోగ్య రక్షణలో అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కట్టుబడి ఉంది” అని తెలిపారు.


