థాంక్స్ సి. ఎం. సార్: రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాలు మంజూరు
1 min read
వై నాగేశ్వరరావు యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్
ప్యాపిలి న్యూస్ నేడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరి గ్రామంలో గోల్డ్ మెయిన్ ప్రారంభానికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి 10 బీసీల గురుకుల పాఠశాలలను మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే విజన్ ఉన్న యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కి బిసి వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2026-27) నుండి కొత్తగా 10 బీసీ గురుకుల పాఠశాలలను* అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
లింగ నిష్పత్తి: మొత్తం 10 గురుకులాల్లో 5 బాలుర కోసం, 5 బాలికల కోసం కేటాయించారు.
తరగతులు: ఈ పాఠశాలల్లో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధన ఉంటుంది.
విద్యార్థుల సంఖ్య: మొదటి ఏడాది ఒక్కో గురుకులంలో 240 మంది చొప్పున చేర్చుకుంటారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆ సంఖ్యను 480 కి పెంచుతారు. దీనివల్ల మొత్తంగా 4,800 సీట్లు అందుబాటులోకి వస్తాయి.బీసీ సంక్షేమ శాఖ డిమాండ్‌కు అనుగుణంగా 20 కొత్త గురుకులాల ఏర్పాటును ప్రతిపాదించగా, తొలి విడతలో 10 పాఠశాలలకు ఆమోదం లభించింది. బీసీ జనాభా ఎక్కువగా ఉండి, ప్రస్తుతం గురుకులాలు లేని నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని 8 జిల్లాల పరిధిలో వీటిని ఎంపిక చేశారు.
శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల (బాలికలు)
అనకాపల్లి జిల్లా: నక్కపల్లి (బాలికలు)
పల్నాడు జిల్లా: మాచర్ల (బాలికలు)
మార్కాపురం జిల్లా: గిద్దలూరు (బాలురు)
అనంతపురం జిల్లా: గుంతకల్లు (బాలికలు)
అన్నమయ్య జిల్లా: రాయచోటి (బాలురు)
కర్నూలు జిల్లా: పత్తికొండ (బాలురు), మంత్రాలయం (బాలికలు)
శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ (బాలురు), కదిరి (బాలురు)
గమనిక: పెనుకొండ, పత్తికొండ మినహా మిగతా అన్ని చోట్ల ప్రస్తుతం గురుకులాలు లేవు. ఈ ఏడాది వీటన్నింటినీ అద్దె భవనాల్లోనే ప్రారంభిస్తారు. ఆ తర్వాత వీటికి సొంత భవనాలను నిర్మిస్తారు.హాస్టల్ విద్యార్థుల విలీనం – ప్రభుత్వానికి భారీ పొదుపు: lప్రస్తుతం 10 నుండి 30 మంది లోపు మాత్రమే విద్యార్థులు ఉన్న బీసీ వసతి గృహాలను (హాస్టళ్లను) గుర్తించి, ఆయా ప్రాంతాల్లోనే ఈ కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారు.సదరు వసతి గృహాల్లోని విద్యార్థులందరినీ ఈ కొత్త గురుకులాల్లోనే చేర్పిస్తారు.దీనివల్ల దాదాపు 60 బీసీ వసతి గృహాల నిర్వహణ భారం తగ్గి, ప్రభుత్వానికి ఏటా సుమారు ₹18 కోట్ల ఖర్చు ఆదా అవుతుందని అంచనా వేశారు.

