NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్నారుల మధ్య ఘనంగా డాక్టర్. శంకర్ శర్మ జన్మదిన వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  తైక్వాండో క్రీడాకారులకు బెల్ట్ గ్రేడింగ్ పోటీలను డాక్టర్. శంకర్ శర్మ ప్రారంభించారు. కర్నూలు నగరం లోని కిడ్స్ వరల్డ్ ఆవరణలో నిర్వహించిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్. శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జంక్ ఫుడ్ తీసుకోకుండా ఇంట్లో అమ్మ చేసిన వంటలే తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ మహిళలకు, యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తైక్వాండో లో యోగా, ప్రాణాయామం, ధ్యానం మిలితమై ఉంటుందని అందువల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణిస్తారన్నారు. నేడు డాక్టర్. శంకర్ శర్మ 67వ పుట్టినరోజు కావడంతో  చిన్నారులు కేక్ కట్ చేసి డాక్టర్. శంకర్ శర్మ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ శాంతి కోరుకునే దేశం భారతదేశం అన్నారు. అనేక దేశాలు యుద్దం చేసుకుంటూ మనవ మనుగడకే ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.   మంచితనంలోనే  దైవం ఉంటుందన్నారు. ఈసందర్భంగా చిన్నారులకు డాక్టర్. శంకర్ శర్మ పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈకార్యక్రమంలో తైక్వాండో కోచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *