28 న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
1 min read
ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు , న్యూస్ నేడు : జిల్లాలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.శుక్రవారం పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కు సంబంధించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని జూన్ 28, 29, 30 తేదీలలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 28 వ తేదీన బూత్ స్థాయి లో పోలియో చుక్కలను వేస్తారని, ఆ రోజు మిస్ అయిన పిల్లలకు 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు 3,52,164 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేయించాలని అధికారులను ఆదేశించారు.. ఇందుకోసం 1630 పోలియో బూత్ లనుఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులందరూ తమ ఐదేళ్లలోపు పిల్లలకు జూన్ 28న సమీప పోలియో బూత్‌లో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు అయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సిడిపిఓ లు, సూపర్వైజర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ పీడీని ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రజలకు తెలిసే విధంగా బస్సులకు స్టిక్కర్లను అతికించడం, ఆడియో, వీడియో ల ప్రదర్శన చేయాలన్నారు. 27వ తేదీన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలని, ప్రేయర్ లో పల్స్ పోలియో తేదీల గురించి పిల్లలకు చెప్పాలని, బ్లాక్ బోర్డ్ మీద తేదీలను రాయించి, విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డీఈవో ను ఆదేశించారు. మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, వారి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏ పిడి, మెప్మా పీడీని ఆదేశించారు.పోలియో వ్యాక్సిన్ నిల్వ ఉంచిన గవర్నమెంట్ హాస్పిటల్స్, పిహెచ్సిలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. కార్మికులు, వలస వచ్చిన వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ ను ఆదేశించారు. కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సమాచారశాఖ డిడి ని ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్ లో డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ ప్రదీప్ కుమార్, ఐసిడిఎస్ పిడి విజయ, డి ఆర్ డి ఏ పి డి రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, డిఇఓ సుధాకర్, ఆర్టిసీ ఆర్ ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

