NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ డెంగ్యూ మాసోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారి డాక్టర్. భాస్కర్  ఆవిష్కరించారు..ఈ సందర్భంగా  మాట్లాడుతూ నీటి నిల్వ ఎక్కడంటే అక్కడ ఉండడంతో వివిధ రకాల దోమలు పెరుగుతాయని, వీటి ద్వారా  డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి నిల్వ ఉండే ప్రదేశాల్లో నీరు నిల్వ లేకుండా  తగిన చర్యలు తీసుకోవడంతో దోమలు గుడ్లు పెట్టకుండా ఉంటాయన్నారు..   ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, రాతిరుబ్బరోళ్ళు, పనికి రాని ఎయిర్ కూలర్స్ ఉంచుకోవడం వల్ల నీరు చేరి దోమలు పుట్టే అవకాశం ఉంటుందన్నారు. ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. రోడ్లు మీద గుంతలు ఉన్న చోట నీరు చేరి మలేరియా, డెంగ్యూ వ్యాధులను విస్తరింప చేసే దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉన్నందున అటువంటి చోట నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో   మలేరియా నియంత్రణ అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్. ఉమా, ప్రోగ్రాం అధికారులు డాక్టర్. శైలేష్ కుమార్, డాక్టర్. మహేశ్వరా ప్రసాద్, డాక్టర్. విస్వేశ్వర్  రెడ్డి,సహాయ మలేరియా అధికారి విజయ్ కుమార్, డిపి ఓ విజయరాజ్, డిపి హెచ్ ఎన్ ఓ అన్నపూర్ణ,డిప్యూటీ డెమో షఫీ వున్నిసా, డిప్యూటీ హెల్త్ ఏడ్యూకేషన్ ఆఫీసర్ పద్మావతి,మలేరియా  సిబ్బంది తదితరులు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *