NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముద్దనగేరి గ్రామంలో విజయవంతంగా భూ పాస్‌బుక్కుల పంపిణీ

1 min read

– ప్రజలకు, పార్టీ శ్రేణులకు వైకుంఠం జ్యోతి కృతజ్ఞతలు

ఆలూరున్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మీ భూమి – మీ హక్కు” రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా, ఆలూరు నియోజకవర్గంలోని ముద్దనగేరి గ్రామంలో 513 మంది రైతులకు నూతన భూ పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు విశేషంగా హాజరై విజయవంతం చేశారు. నూతన భూ పాస్‌బుక్కులు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ భూములకు శాశ్వత హక్కులు, భద్రత కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, “రైతు హక్కుల పరిరక్షణే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి రైతు చేతిలో భద్రమైన భూ హక్కుల పత్రం ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ముద్దనగేరి గ్రామంలో 513 మంది రైతులకు భూ పాస్‌బుక్కులు అందించడం ఎంతో సంతోషంగా ఉంది” అని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలు, రైతులు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే సహకరించిన అధికార యంత్రాంగానికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు.

About Author