జనసైనికులకు అధికారులు సహకరించాలి
1 min read
అర్హతను బట్టి పదవులు
కార్యకర్తలకు అన్యాయం జరిగితే అండగా ఉంటా
మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి..
నందికొట్కూరు న్యూస్ నేడు: జనసేన పార్టీ కార్యకర్తలకు అధికారులు సహకరించాలని మచిలీపట్నం జనసేన పార్టీ ఎంపీ మరియు నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు బాలశౌరి అన్నారు.నంద్యాల జిల్లా పట్టణంలోని కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం జనసేన కార్యకర్తల సమావేశం జనసేన నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ జన సైనికులు అర్హతను బట్టి పదవులను ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత జన సైనికులపై ఉంది.రానున్న గ్రామ పంచాయతీ,ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో 30 శాతం రిజర్వేషన్ సీట్లు జనసేనకు రానున్నాయి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అధికారులు పనులు చేసేందుకు జిల్లా కలెక్టర్,ఎస్పీతో మాట్లాడతానని అన్నారు. కార్యకర్తలకు ఏమి అన్యాయం జరిగినా నా దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానని భరోసానిచ్చారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానంతో గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని నందికొట్కూరు ను అభివృద్ధి చేసేందుకు పవన్ కళ్యాణ్ తో మాట్లాడతానని 17వేల కోట్లతో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులను పవన్ కళ్యాణ్ తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింతా సురేష్ బాబు,బ్రాహ్మణకొట్కూర్ వలి భాష,రామిరెడ్డి,ప్రభాకర్ మధు,రాము మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


