ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలు అధిక దిగుబడులు సాధించ వచ్చు
1 min read
రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి .విజయ్ కుమార్
కర్నూలు, న్యూస్ నేడు: ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి ఆరోగ్యకరమైన పంటలు, అధిక దిగుబడులతో పాటు నిరంతరాదయం పొందవచ్చు అని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి .విజయ్ కుమార్ వారు తెలిపారు. కర్నూలు ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి గారి అధ్వర్యంలో కర్నూలు జిల్లా గూడూరు, గోనెగండ్ల, దేవనకొండ మండలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన పొలాలను సందర్శించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణ, కరువు నివారణ చర్యలు మరియు రైతుల సన్నద్ధతపై సమీక్షించేందుకు గురువారం కర్నూలు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్న రైతుల పొలాలను సందర్శించిన ఆయన, ప్రధాన పంటలు, అంతర పంటలు, బహుళ పంటల విధానాలు, తేమ సంరక్షణ చర్యలు, జీవవైవిధ్య ఆధారిత సాగు పద్ధతులు తదితర అంశాలపై రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించి, ఎల్ నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. పర్యటనలో భాగంగా గ్రామ సంఘాలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమైన శ్రీ విజయకుమార్, ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమలులో వారి పాత్ర, గ్రామ స్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించారు. ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో మరింత విస్తరించేందుకు అవసరమైన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పండ్ల తోటలు, పూల తోటలను సందర్శించి, అక్కడ అమలు చేస్తున్న వివిధ ప్రకృతి వ్యవసాయ నమూనాలను పరిశీలించారు. రైతుల అనుభవాలను తెలుసుకుని, ఆయా నమూనాలను మరింత బలోపేతం చేసే అంశాలపై సూచనలు చేశారు. అనంతరం కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారం, చేపడుతున్న కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృత స్థాయిలో రైతులకు చేరవేసేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ సిబ్బంది అందరూ మోడల్స్ వేసి రైతులతో వేయించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పాటించి పండించిన ఆహారం తినడం వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా, దీర్ఘకాలంలో పర్యావరణం దెబ్బతినకుండా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతి అందించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులు పాటించి పండించిన పంటలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులందరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ప్రధాన పంటతో పాటు అనుబంధ పంటలు వైవిద్య పంటలు వంటి రక రకాల పంటలు వేసుకొని ఆదాయంతోపాటు నేలలో జీవపదార్థం, భూసారం పెరుగుతుంది. మొక్కలు పెరగడానికి అవసరమైన పోషకాలని నేలలో ఉంటాయని రైతులకు అర్థమయ్యే విధంగా సిబ్బంది తెలియజేయాలిని అన్నారు. పలు పంటల సాగు చేయడం వల్ల నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. జీవవైవిద్యం పెరిగి మొక్కలకు పోషకాల లబ్బితా పెరుగుతుంది. చీడపీడలు, తెగుళ్ళను తట్టుకోగలుగుతుంది. నేల కోతను అరికడుతుందని నేలగుల్ల వారి వానపావుల వృద్ధి జరుగుతుందని తెలిపారు. అలాగే విత్తన గుళికల తయారీ విధానం, వాటి లాభాల గురించి తెలిపారు. నేలను కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు స్థిరమైన, సుస్థిరమైన, సజీవనరుగా అందించడం మన అందరి బాధ్యత. కానీ ఇప్పుడు మనం స్వయం కృతపరాధంతో నేల ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని హెచ్చరిస్తునారని అన్నారు. నేలపై మానవజాతి మనుగడ కొనసాగాలంటే ప్రకృతి వనరుల విద్వాంసాన్ని ఆపాలని సూచిస్తున్నారు. భూమిని కాపాడటమే కాదు, భూమి మీద వున్న ఉనికిని కాపాడడం అందరి బాధ్యతఅన్నారు. నేలలో నిక్షేపాలు అపరిమితం కాదు పరిమితమైనవి. నేలను కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు స్థిరమైన, సుస్థిరమైన, సజీవనరుగా అందించడం మన అందరి బాధ్యత అన్నారు. కావున భవిష్యత్తు తరాలను కాపాడుకోవడం కోసం విషరహిత స్థాపన అందరి బాధ్యత. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యమనే తాత్వికతతో వ్యవసాయాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పర్యావరణంగా స్థిరమైనదిగా తయారు చేయడానికి, రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికి, నేల, నీరు, వంటి సహజ వనరులను ఉపయోగించి మంచి ఫలితాలు సాధించడానికి ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి పంటలను సాగు చేసి పండించినటువంటి ఆహారం తినడం వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా దీర్ఘకాలంలో పర్యావరణం దెబ్బ తినకుండా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతి వనరులను అందించే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ ఏ. రామకృష్ణ రెడ్డి, సీనియర్ థిమాటిక్ లీడ్ చక్రాల చంద్ర శేఖర్, సీనియర్ కన్సల్టెంట్ రాజేశ్వర్, జిల్లా కన్సల్టెంట్ వి. లక్ష్మయ్య DPMU సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబంది, రైతులు పాల్గొన్నారు.


