జిల్లాలో రైతులు అవసరాలకు సరిపడా ఎరువులు పుష్కలంగా నిల్వలు ఉన్నాయి
1 min read
ఎరువులు సరఫరాలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్కేక దృష్టిపెట్టాలి
ఏపిఏఐయంఎస్ 2.0 ద్వారా ఎరువులు సరఫరాపై రైతులకు పూర్తి అవగాహన కలిగించాలి
పెదపాడు మండలం అప్పనవీడు ఎరువులు దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్టిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామం గురువారం శ్రీశ్రీనివాస ఏజెన్సీస్ ఎరువులు షాపును జిల్లా కలెక్టరు కె.వెట్టిసెల్వి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కంప్యూటరు డేటాను, స్టాకు రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, ఎరువులు స్టాకు బోర్డును, ఎలక్ట్రానిక్ మిషన్ కాటా ను పరిశీలించి, స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏఏ పంటలు వేశారు అని వివరాలను అడిగితెలుసుకున్నారు. రైతులు ఆన్లైన్ ద్వారా బుకింగును విధానమును పరిశీలించి, రైతులకు సులువుగా ఆన్లైన్ అయ్యేలా చూడాలని తెలిపారు. ఎరువులు స్టాకు గోదామును పరిశీలించి,రిజిస్టరు ప్రకారం స్టాకును పరిశీలించారు. రైతులు ఆన్లైన్ ద్వారా బుకింగు చేసుకున్న ఎరువులు బస్తాలను జిల్లా కలెక్టరు స్వయంగా రైతులకు అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్టిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతులు అవసరాలకు సరిపడా ఎరువులు పుష్కలంగా నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరతలేదని స్పష్టం చేశారు. ఏపీఏఐయంఎస్ 2.0 ద్వారా రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందే అవకాశం ఉందని, మొబైల్ నెంబరు నవీకరణ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. ఏపీఏఐయంఎస్ ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎరువులు సరఫరాపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. యాప్ ద్వారా రైతులు పంటభూమి విస్తీర్ణాన్ని బట్టి వారికి కేటాయించిన యూరియా మరియు డీఏపీ బస్తాలు అందుబాటులో ఉంటాయని, ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయవలసిందిగా రైతులకు సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి యస్.కె.హాబీబ్ బాషా, తహశీల్దారు ఏ.కృష్ణజ్యోతి, మండల వ్యవసాయ శాఖ అధికారి యస్.కె.ఇమామి ఖాసీం, స్థానిక రైతులు, షాపు నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

