స్వాతంత్రోద్యమ విప్లవ జ్వాల అల్లూరి సీతారామరాజు
1 min read
యువతకు స్ఫూర్తి ప్రదాత అల్లూరి
ఏఐవైఎఫ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:స్వాతంత్రోద్యమ విప్లవ జ్వాల అల్లూరి సీతారామరాజు.
యువతకు స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు.
ఏఐవైఎఫ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్.
ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కురెళ్ళ వరప్రసాద్.
కర్నూలు, న్యూస్ నేడు: స్వాతంత్ర్య సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవ జ్వాలలా పోరాటాలు నిర్వహించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. మన్యంలో గిరిజనులను సమీకరించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమాల్ని నడిపి తన చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు ఆయన చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని దేశంలో యువత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించడమే అల్లూరి సీతారామరాజుకి ఇచ్చే ఘనమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు గొర్రెల వరప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని యువతకు నిరంత స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్లు పూర్తయినా నెరవేర్చలేదని విమర్శించారు. యువత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా చేసే పోరాటాలలో అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, శాయన అభిలాష్jరి విజయ, ఉప్పులూరి లక్ష్మి భవాని తదితరులు పాల్గొన్నారు.

