NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు విస్తరణ పై సంతకాల సేకరణ 

1 min read

పత్తికొండ రోడ్డు విస్తరణ చేపట్టే అంతవరకు ఉద్యమం ఆగదు సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి 

న్యూస్ నేడు, పత్తికొండ:  పత్తికొండ పట్టణంలోని రోడ్డు విస్తరణకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం  పత్తికొండ పట్టణంలో స్థానిక నాలుగు స్తంభాల కూడలి దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, సీనియర్ సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, దస్తగిరి, గోపాల్ రైతు సంఘం కార్యదర్శి సిద్దయ్య గౌడ్ ఉపాధ్యక్షులు మధు రాజుల కారప్ప వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుజ్జులు, శికామణి పట్టణ కార్యదర్శి నరసన్న పాల్గొని పట్టణ ప్రజలతో, వాహనదారులతో పట్టణ వాసులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్తికొండ రోడ్డు విస్తరణ జరగకపోవడం ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు శతమాతమవుతున్నారని అన్నారు. పత్తికొండ నియోజకవర్గం ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం వాగ్దానాలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. వెంటనే రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాన్ని చేపడతామని, ఉద్యమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా వెయ్యి మంది సంతకాలు చేసి రోడ్డు విస్తరణ జరగాలని మద్దతు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *