NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు

1 min read

ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఘన నివాళులు

హొళగుందన్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆదేశాల మేరకు అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ సఫీ ఉల్లా ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత అని కొనియాడారు. రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, పేద కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.ఆరోగ్యశ్రీ వంటి చారిత్రాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చి లక్షలాది కుటుంబాలకు ప్రాణాధారంగా నిలిచారని అన్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేసిన నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్థాయిగా గుర్తుండిపోతారని తెలిపారు.ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వైఎస్సార్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని, ప్రజాసేవే ఆయనకు నిజమైన నివాళి అని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, ఎంపీపీ తనయుడు ఈసా, వైస్ ఎంపీపీ హనుమప్ప, శేషప్ప, ఎంపీటీసీ మల్లికార్జున, జడ్పీటీసీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూసినే విరూపాక్షి అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులర్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *