NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

50వ డివిజన్ లో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలు

1 min read

49,50 డివిజన్ ఇంచార్జీ ల  అధ్వర్యంలో కార్యక్రమం

పెద్దఎత్తున పాల్గొన్న వై సి పి కార్యకర్తలు అభిమానులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దివంగత ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలు యం.ఆర్.సి కాలనీ 50వ డివిజన్ లో49,50 డివిజన్ ఇంచార్జీ లు పల్లా రమేష్ , అగ్గాల కృష్ణ ,మణిపూరి కుమారి అధ్వర్యంలో కేక్ కట్ చేసి  ఘనంగా నిర్వహించారు.స్థానిక సెంటర్లో ఉన్న వైస్సార్ కాంస్య విగ్రహానికి గజమాలను వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా,పోలవరం ప్రాజెక్ట్ పున:నిర్మాణ సాధకుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఎన్నో సేవలందించి రైతు బాంధవుడిగా లక్షలాదిమంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకుని. తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని నాయకులు కొనియాడారు. వైయస్ ఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరంఈ సందర్భంగా అల్పాహారం మంచినీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మైక్రో ఆర్టిస్ట్ మేతర సురేష్ , సొంగ మధుసూదనరావు (మధు) ఘంటా సాయి,ప్రదీప్,అగ్గల కృష్ణ , ఉండి నాగేశ్వరరావు, పి దినేష్ , అలజిoగి నాగరాజు,అత్తిలి సురేష్ మరియు పార్టీ అన్ని అనుబంధ  విభాగాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *