NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు పర్యటించవచ్చన్న సమాచారం మేరకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉన్న ప్రదేశాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు.  ముందుగా హెలిపాడ్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని , అనంతరం   ఈ సి ఆర్ ఎఫ్ డాం, పవర్ హౌస్, యూనిట్ టర్బైన్, తదితర ప్రాంతాలను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో పనుల ప్రగతిపై ఏర్పాటుచేయనున్న ఎగ్జిబిషన్ ఏర్పాట్లపై ప్రాజెక్ట్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  ముఖ్యమంత్రి పనులను పరిశీలించే ప్రతీ ప్రదేశంలోను పనుల ప్రగతిని తెలియజేసేందుకు ఇంజనీరింగ్ అధికారులను నియమించాలన్నారు. జిల్లా కలెక్టరు వెంట జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ఆర్డీవో యం.వి.రమణ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఇ రమేష్ కుమార్, యస్ఇ కె.రామచంద్రరావు, ఇఇలు డి.శ్రీనివాసు, పి.వి. వెంకటరమణ, డిఇ మాధవరావు, ఇంజనీరింగు , బృందం, తహశీల్దారు జోజి, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *