11కెవి పవర్ పేట ఫీడర్ లో లైన్లకు మరమ్మతు
1 min read
11వ తేదీ ఉ:8గం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి
ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజశేఖరం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుమండలం,11కెవి పవర్ పేట ఫీడర్ లో లైన్లకు మరమ్మతు చేయుటకు గాను మరియు కరెంటు లైన్ల కింద ఉన్నటువంటి చెట్లు తొలగించుట కొరకు ఈనెల 11వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడునని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజశేఖరం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికరణంగా పవర్ పేట ఫీడర్ పరిధి లో ఉన్న జి ఎన్ టి రోడ్డు,వసంతమహల్ సెంటర్,కర్ర వంతెన,పవర్ పేట,పాత బస్టాండ్ ,పాండురంగా పురం ,గూడ్స్ షెడ్ రోడ్డు మరియు పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని, కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కోరారు.

