NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో విద్యుత్ శాఖ పనులు నత్త నడక

1 min read

అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఆర్డిఎస్ఎస్ ప్రధాన లక్ష్యం స్మార్ట్ మీటరింగ్ వంటి డిజిటల్ టెక్నాలజీల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

 ఆర్ డి ఎస్ ఎస్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ జిల్లాలో స్కీమ్ పనులు జరుగుతున్న తీరుపై

ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆర్డిఎస్ఎస్ ప్రధాన లక్ష్యం స్మార్ట్ మీటరింగ్ వంటి డిజిటల్ టెక్నాలజీల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు, నాణ్యమైన విద్యుత్తు అందించటంతో పాటు, విద్యుత్ పంపిణీ నెట్వర్క్ ను ఆధునీకరించి, వాణిజ్య సాంకేతిక నష్టాలు తగ్గించి, డిస్కమ్స్ కు ఆర్థిక స్థిరత్వం కల్పించడం అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. బుధవారం మధ్యాహ్నం ఏలూరు కలెక్టరేట్లో జరిగిన ఆర్ డి ఎస్ ఎస్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ జిల్లాలో స్కీమ్ పనులు జరుగుతున్న తీరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఫీడర్ల పనులు అనేకచోట్ల నత్త నడకన సాగుతుండటంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ఫోన్ చేసి అడిగినా కాంట్రాక్టు కంపెనీ స్పందించడం లేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల కొరత ఉందని, ట్రాన్స్ఫార్మర్లను మార్చే పనిని, కొత్తవాటిని  ఏర్పాటు చేసే పనిని వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. కోకో, కొబ్బరి, పామాయిల్ వంటి ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తూ వ్యవసాలయ ఆధారితంగా ఉన్న ఏలూరు జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాపై విద్యుత్ శాఖ దృష్టి పెట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను కోరారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలను అరికట్టేందుకు సి సి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలోని ఇబ్బందులను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు పెద్ద మనసుతో సరైన చర్యలు చేపట్టాలని చింతమనేని కోరారు. సమావేశంలోనే  ఏపీఈపీడిసీఎల్ సీఎండీ తో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లాలో కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటు, లో ఓల్టేజి సమస్యలను పరిష్కరించేందుకు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.  సమావేశంలో ఎంపీ తో పాటు దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు ఎమ్మెల్యేలు, ఏపీఈపీడిసీఎల్ డైరెక్టర్ టి. వనజ, సీజీఎం బి.అశోక్ కుమార్, జీఎం డేవిడ్, ఎస్ఈ అంబేద్కర్, ఇతర అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *