NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ శాంతికి భగవద్గీతనే మార్గదర్శి

1 min read

డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు.

ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రపంచంలో శాశ్వత శాంతి నెలకొనాలంటే వ్యక్తిలో విలువలు, సమాజంలో ధర్మం, నాయకత్వంలో నిష్కామ సేవాభావం ఉండాలని, ఈ మూడు అంశాలను సమగ్రంగా బోధించిన మహాగ్రంథం భగవద్గీత మాత్రమేనని ప్రముఖ సంస్కృత పండితులు, వ్యాఖ్యాత, ధార్మిక ప్రవచకులు డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు అన్నారు. నంద్యాల పట్టణం, బాల్కొండ హాలువద్ద వెలసిన శ్రీ మోక్షరామచంద్రస్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్దలతో ముగిశాయి. మూడు రోజులు , శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ప్రముఖ వైద్యులు గెలివి సహదేవుడు, సీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు డి.మధు సుధన్ రావు, డి.రాంప్రసాద్, వీరన్న, రామ్మూర్తి, శ్రీనివాసులు, పవన్ కుమార్, శంతన్, మనోజ్, నవనీత్, రామకృష్ణతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author